సిద్ధగురు ప్రవచనములు

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు 2002 వ సంవత్సరంలో నిష్కామ జ్ఞానదాన సేవ కు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటగా శిరిడి సాయిబాబా జీవితము మీద అనుగ్రహ భాషణం ఇచ్చారు. ఆనాటి నుండి యావత్ భారతదేశం, అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించి శిరిడి సాయి బాబా సమగ్ర జీవితాన్ని, బోధలను, మార్గదర్శకత్వాన్ని తెలియజేసారు. అనేక సిద్ధగురువుల జీవితాలను మరియు వారి బోధలను, ఆత్మసాక్షాత్కార స్వీయ అనుభూతులను, కుండలినీ శక్తి ఇంకా మనో నియంత్రణపై ప్రవచనాలు ఇచ్చారు. వారి ప్రవచనాల ద్వారా లోకానికి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక నిగూడ తత్వ రహస్యాలను బహిర్గతం చేశారు.