దేవీ కాలోత్తరం

యావత్ విశ్వాన్ని సృజించిన పరమాత్మ యొక్క సుజ్ఞానము సాధారణమైనది కాదు. శాస్త్రాలు చదివితే, సాధారణ పండితుల ఉపన్యాసాలు వింటే అర్ధమయ్యేది కాదు. పరమాత్మను దర్శించి ఆత్మానుభూతి పొందిన సిద్ధగురువుల ముఖతః శ్రవణము చేస్తే సులభముగా అర్ధమవుతుంది.

పార్వతిదేవి పరమాత్మ యొక్క రహస్య జ్ఞానము గురించి శంకర భగవానుడిని ప్రశ్నించడం జరిగింది. లోక కళ్యాణమునకై పార్వతి దేవి అడిగిన ప్రశ్నలకు పరమేశ్వరుడు ఇచ్చిన సమాధానములు “దేవికాలోత్తరము” గా ప్రసిద్ధిచెందినది.

భగవాన్ రమణ మహర్షి వారు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అనుభూతితో గ్రహించిన సిద్ధమహాగురువు. రమణ మహర్షి వారు అనేక తత్వశాస్త్ర గ్రంధాలపై అవగాహన కలిగివున్నారు. మహర్షి వారు తన శిష్యులను కొన్ని గ్రంధాలు మాత్రమే పారాయణము చేయమని చెప్పేవారు అందులో ఒకటి “దేవి కాలోత్తరం”. “దేవి కాలోత్తరం” దేవదేవుడు గురించిన జ్ఞానము ప్రసాదించే గ్రంధము. “దేవి కాలోత్తరం” లోని ప్రతీ శ్లోకము సర్వవ్యాపి, దేవదేవుడైన పరమశివుడి రహస్య జ్ఞానము వివరిస్తుంది.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు దసరా నవరాత్రులలో “దేవికాలోత్తరం” లో పరమశివుడు పార్వతీదేవికి బోధించిన రహస్య జ్ఞానమును అసామాన్య వ్యాఖ్యానంతో సులభముగా అర్ధమయ్యే విధముగా సాధకులకు అందించారు.

గ్యాలెరీ