శక్తిపాతం
అవలోకనం
ఆత్మదర్శనం పొందిన మహాత్ములకు, సహస్రార చక్రం ద్వారా విశ్వశక్తి సదా ప్రవహిస్తుంటుంది. ఈ విశ్వశక్తినే కాస్మిక్ ఎనర్జీ అని అంటారు. గురువు యొక్క కాస్మిక్ ఎనర్జీ శిష్యుడిలోకి ప్రవేశించడాన్ని శక్తిపాతము అంటారు.
ఆత్మదర్శనం పొందిన గురువులు మాత్రమే శక్తిపాతము చేయగలరు. అటువంటి గురువు శక్తిపాతము చేసినపుడు, గురువు యొక్క దివ్య శక్తి శిష్యునిలోకి ప్రవేశించి శిష్యులు ఏ సాధన చేయకనే క్షణాలలో దివ్య అనుభవాలను, పరమానందంను పొందగలరు.
వివిధ రకాల శక్తిపాతం
మానవ జీవిత పరమార్ధం ,పరమగమ్యం ఆత్మసాక్షాత్కారం పొందడం. ఇది సాధకుడు సొంత బుద్ధితో,ప్రయత్నముతో కృషితో ,సాధనతో పొందేది కాదు. ఆత్మసాక్షాత్కారం కేవలం గురు అనుగ్రహం వలననే కలుగుతుంది. గురువు అనుగ్రహించి శక్తిపాతము చేసినపుడు మాత్రమే సాధకుడు పరమానందం పొందగలడు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు నాదశక్తిపాతము ద్వారా ధ్యాన సాధన చేయించెదరు.




మహర్షి వారిచే శక్తిపాత విధానం
- సిద్ధగురు ఓంకారం మహర్షివారు, సాధకులచే మూడు సార్లు ఓంకారం చెప్పించెదరు . అదియే నాదశక్తిపాతం.
- సూచనలు మహర్షి వారు సాధకులకు కన్నులు మూసుకొని శ్వాసను ఎలా గమనించాలో సూచనలు ఇచ్చెదరు. అది చేయలేని వారికి ఇంకా సులువైన మార్గాన్ని కూడా చెప్తారు.
- ధ్యాన శిక్షణ సమయం సాధకులు 45 నుంచి 60 నిముషాలు మహర్షివారి అనుగ్రహముతో ధ్యానము చేసెదరు.
- ధ్యాన శిక్షణ ముగింపు ధ్యాన శిక్షణ చివరలో మహర్షి వారు ఓంకారం చెప్పెదరు. దానితో శక్తిపాత కార్యక్రమం ముగియును.
ప్రయోజనాలు
శక్తిపాతం పొందినపుడు కలిగే ప్రయోజనాలు. గురువు నుండి శక్తిపాతం పొందినపుడు సాధకుడు మనస్సు సులభముగా అంతర్ముఖం అవుతుంది. సాధకులు వారి మనో పవిత్రత, చక్రశుద్ధిని బట్టి ఈ క్రింది అనుభవాలు పొందగలరు.
- కుండలినీ జాగృతి
- చక్ర శుద్ధి
- అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి
- విభిన్నరంగులు దర్శించడం
- వివిధ దేవతల దర్శనం
- సూక్ష్మశరీర యానం
- విభిన్న వాసనలు కలగడం
- ఆత్మసాక్షాత్కార దివ్య స్థితిని పొందడం
- విభిన్న లోకాలను చూడటం
- ఒత్తిడి నుండి ఉపశమనం
- సిద్ధ పురుషుల దర్శనం
- మనస్సు నిశ్చలమై కొన్ని గంటలు కూర్చొనగలరు
- దుష్టపీడ నివారణ
- రోగనాశనం
- చనిపోయిన వారిని దర్శించడం
ఫలితాలు
శక్తిపాతం పొందిన వారినుండి సేకరించిన ఫలితాలు
శక్తిపాత అనుభవాలు
శక్తిపాతం - ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణం
శక్తిపాతానికి సంబంధించిన అనేక ప్రశ్నలు, సంకోచాలు, అనుమానాలను నివృత్తి చేసే అద్భుత గ్రంథం శక్తిపాతం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు శక్తిపాతం అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథము తెలుగు,హిందీ భాషలలో అందుబాటులో ఉన్నది. శక్తిపాతం గ్రంథము లో మహర్షి వారు తాను పొందిన కుండలిని జాగృతి అనుభవాలను, సాయిబాబాచే మహర్షి వారు పొందిన శక్తిపాత విధానాన్ని, రహస్యాన్ని, శక్తిపాతం పొందినపుడు సాధకుడిలో జరిగే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు విపులంగా వివరించడం జరిగింది. మహర్షి వారి నుండి శక్తిపాతం స్వీకరించే ముందు సాధకుడు ఈ గ్రంథాన్ని కనీసం రెండు సార్లైనా అధ్యయనం చేయమని మహర్షి వారి సూచన.