jalalingas

ఆనంద తీర్థం

అవలోకనం

సహస్ర శివలింగ ప్రతిష్ఠలో భాగంగా 7 అడుగుల లోతులో ఉన్న ఆనందతీర్ధ నిర్మాణం ,316 శివ లింగాల ప్రతిష్ఠతో జరిగింది .అందులో 232 శివ లింగాలు శివుని యొక్క సహస్ర నామాలు .ఇంకా ఏకాదశ రుద్రులు,అష్టమూర్త్యాత్మక శివలింగాలు ,4 వేద లింగాలు మధ్యలో 30 అడుగుల ఆకాశ లింగము ,సూర్య గ్రహ శివలింగం గౌతమ బుద్ధుని ,శిరిడి సాయి ,సదాశివ విగ్రహ మూర్తులు వారి శక్తిని ప్రసరింప చేస్తున్నారు . ఆనంద తీర్థం చుట్టూ ఉన్న పంచభూత లింగాలు ,నవగ్రహ శివ లింగాలు ,నక్షత్రాత్మక శివ లింగాలు , రాశ్యాత్మక శివలింగాలు ,రాగి ,స్ఫటిక శివ లింగములు ,శిరిడి సాయి బాబా,సింహవాహిని అమ్మవారు ,దక్షిణ మూర్తి విగ్రహ మూర్తులు ఆ ప్రదేశాన్ని మరింత శక్తివంతం చేస్తున్నాయి. ఆనంద తీర్థం ఎదుట ప్రతిష్ఠించిన మహానందీశ్వరుడు ఆనంద తీర్థానికి ద్వారపాలకుడిలా దర్శనమిస్తాడు. ఆనంద తీర్థమును దర్శించిన భక్తులు ఇక్కడ కొలువైన దివ్యశక్తిని అనుభూతి చెందుతారు. నవంబర్ 9 ,2019 వ సంవత్సరములో ఆనంద తీర్థమును సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు ఈ లోకానికి అందించారు .

నివేదన

sahasra-linga-abhishekam

ఆనంద తీర్థ పవిత్ర స్నానం

కుంభమేళాలో ఒకసారి పవిత్ర స్నానం ఆచరిస్తే ఏ ఫలము కలుగుతుందో అట్టి ఫలము ఒకసారి ఆనంద తీర్థములో పవిత్ర స్నానం ఆచరిస్తే కలుగుతుంది. ఆనంద తీర్థములో పవిత్ర స్నానాలు ఆచరించడం వలన శారీరక, మానసిక వికాసంతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా వికసిస్తుంది.

sahasra-linga-archana

అభిషేకం

గ్రహ దోషములు, కర్మ దోషముల వలన మానవులు కష్టాలు పడుతుంటారు. అటువంటి వారు వారివారి నక్షత్ర, రాశుల మరియు నవగ్రహాల శివ లింగాలకు అభిషేక పూజలు నిర్వహించి దోష నివారణ పొందవచ్చు. ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలతో మరియు ఇతర దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు ఈ అభిషేక పూజలతో సత్ఫలితాలు పొందెదరు.