సిద్ధగురు ఆరా

సృష్టిలోని ప్రతీ వస్తువు చుట్టూ జీవ విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. దానినే ఆరా అంటారు. ఆరా అంటే ప్రతీ వస్తువు నుండి వెలువరించే ఆత్మశక్తి. ఆరా జీవుడి దేహములో ఉన్న షట్ చక్రాలలో ఉన్న శక్తికి అనుసంధానమై ఉంటుంది.

సిద్ధగురువు శ్రీ రమణానంద మహర్షి వారు ఆత్మదర్శనము పొందిన అద్భుత యోగీశ్వరులు. కాబట్టి మహర్షి వారి ఆరా నిరంతరము సానుకూల, ఆధ్యాత్మిక శక్తి కిరణాలు వెదజల్లుతుంటుంది. మహర్షి వారి ఆరాలో ఉండే శిష్యులు శారీరకమైన, మానసికమైన ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక అభ్యున్నతి శీఘ్రముగా పొందెదరు.

శ్రీ రమణానంద మహర్షి వారిలో విశ్వశక్తి నిరంతరమూ షట్ చక్రాలలో ప్రవహిస్తూఉంటుంది. ఈ విశ్వశక్తినే కాస్మిక్ ఎనర్జీ అని అంటారు. అటువంటి మహితాత్ముడి నుండి వెలువడే కాస్మిక్ కిరణాలు చాలా శక్తివంతముగా ఉంటాయి. అందువలనే మహర్షి వారి ఆరా లో ఉన్న భక్తులు మహర్షి వారినుండి కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి చక్రశుద్ధి ని పొందడం వలన క్షణాలలో ఆధ్యాత్మిక దివ్య అనుభవాలను పొందెదరు.

siddhaguru heart chakra at 90%

అనాహత చక్రం

రమణ మహర్షి ప్రకారము అనాహత చక్రము, సహస్రార చక్రంతో సంభంధం కలిగివుంది. భగవంతుడు ఈ చక్రములో ప్రేమ రూపములో ఉంటాడు. దివ్య ప్రేమ ఎంతగాఉంటే అంతగా ఆ చక్రము యొక్క ఆరా ఉంటుంది.

siddhaguru throat chakra at 100%

విశుద్ధ చక్రం

విశుద్ధ చక్రం సూక్ష్మశరీరము గురించి తెలియజేస్తుంది. దీనినే జీవాత్మ అంటారు. జీవుడిలోని భావాలను వ్యక్తీకరణ చేయిస్తుంది. ఈ చక్రం మనస్సును బాలన్స్ చేసి పవిత్రం చేస్తుంది. మనస్సు ఎంత పవిత్రముగా ఉంటే ఈ చక్రము యొక్కఆరా కూడా అంత పవిత్రముగా ఉంటుంది.

siddhaguru third-eye chakra at 100%

ఆజ్ఞా చక్రం

ఆజ్ఞా చక్రం నుదుటి స్థానములో ఉంటుంది. ఇది అంతర్బుద్ధి కేంద్రము. ప్రపంచం గురించి మనస్సు యొక్క అవగాహనను వివరిస్తుంది. ఈ చక్రము ఆరా ఎంత ఎక్కువగా ఉంటే అంతగా మనస్సు నిశ్చలమవుతుంది.

సాక్ష్యము

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షివారు ఆత్మసాక్షాత్కారము పొందిన అవతార పురుషుడు అని అమెరికా లోని  “ANGELICA of ANGELS” of Salem, Massachussets, USA మహర్షి వారి ఆరా మరియు శక్తిక్షేత్రము గురించి వెల్లడించిన నివేదిక సాక్ష్యముగ నిలిచింది . ఆ నివేదిక ప్రకారము శ్రీ రమణానంద మహర్షి వారి విశుద్ధ, ఆజ్ఞ మరియు సహస్రార చక్రాలు 100% తేజస్సుతో  ఉన్నాయని, కాబట్టి వారు ఆధ్యాత్మిక శక్తిని పంచడానికి వచ్చిన దైవ స్వరూపుడు అని నిర్ధారించారు.

ఫోటోలు

Siddhaguru Aura