గోశాల

మన సనాతన వేద సంప్రదాయంలో గోవును గోమాతగా భావించి పూజిస్తారు. ఎవరైతే గోమాతను ఆరాధిస్తారో, సేవ చేస్తారో వారికి సుఖ శాంతులు కలుగుతాయి. కష్టనష్టములు నుండి, అశాంతి నుండి విడిపడతారు.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మహాపీఠంలో 2015వ సంవత్సరంలో గోశాలను గోవుల సంరక్షణ మరియు పోషణకై స్థాపించారు. అప్పటినుండి గోశాల, గోవులు మహాపీఠంలో అంతర్భాగం అయ్యింది. వాటి నిర్వహణ ఇక్కడ చేపట్టిన ప్రధాన కార్యకలాపాల్లో ఒక భాగం.

గోమాత నుండి వచ్చే 5 రకాల ఉత్పత్తులు - ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోపంచకంను పంచగవ్య అంటారు. ఈ పంచగవ్యను రమణేశ్వర మహాపీఠంలో జరిగే నిత్య అభిషేకములలో మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలలో వినియోగిస్తారు.

ఆవు పేడ నుండి సేకరించిన పవిత్ర విభూతిని నిత్యమూ శివుని అభిషేకంలో వినియోగిస్తారు. ప్రస్తుతం మహాపీఠం లోని గోశాలలో 200 ఆవులు, 100 దూడలు ఉన్నాయి. వాటినుండి నిత్యము 200 లీటర్ల ఆవు పాలు లభిస్తున్నాయి. రమణేశ్వరంలో కొలువై ఉన్న 1365 శివ లింగాల అభిషేకానికి ఈ పాలనే వినియోగిస్తారు.
ఈ క్రింది సూచించిన గోసేవలలో పాల్గొనవచ్చు:

ఔషధ సేవ

ఒక నెల లేదా కొన్ని నెలల గోవుల ఆరోగ్య సంరక్షణకు వినియోగించే ఔషధ సేవలో పాల్గొనవచ్చు.

గోవులకు అందించే ఆహారం

ఒక రోజు, ఒక నెల లేదా ఒక సంవత్సరకాలం గోవులకు ఆహారం అందించే సేవలో పాల్గొనవచ్చు.

మీకేమైనా ప్రశ్నలున్నాయా ?