విషయ సూచిక

గ్రామదేవత ఆలయము - ప్రస్తావన

మన భారతీయ సంప్రదాయములో గ్రామదేవతలను ఆరాధించడం సనాతన కాలమునుండి ఆచారంగా ఉన్నది. గ్రామదేవతను గ్రామాన్ని సంరక్షించే శక్తిస్వరూపిణిగా ఆరాధిస్తారు. గ్రామ దేవతలు అంటువ్యాధులు రాకుండగా, దుష్ట శక్తులు, క్షుద్ర శక్తులు గ్రామములోకి ప్రవేశించకుండా సదా సంరక్షణ చేస్తుంటారు మరియు ప్రజలు ఆరోగ్యముతో, సుఖ శాంతులతో ఉండే విధముగా అనుగ్రహిస్తారు.

గ్రామ దేవతలందరూ సాక్షాత్ శ్రీ దుర్గాదేవి యొక్క ప్రతిరూపములే. ఆయా గ్రామస్థుల నమ్మకానికి అనుగుణంగా గ్రామ దేవతలను వివిధ రకాల నామాలతో ఆరాధించడం జరుగుతోంది. కానీ అందరు గ్రామ దేవతలకు మూలం శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవి. గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించినా, పూజలు చేసినా సాక్షాత్తు దుర్గాదేవికి సమర్పించినట్లే.

కరోనా - గ్రామ దేవత

కరోనా వైరస్ అనే మహమ్మారి కారణముగా సర్వ మానవాళి ఒక అనూహ్యమైన మార్పుకి గురైంది. ఒక్క దేశములోనే కాకుండా ప్రపంచ వ్యాప్తముగా కరోనా మహమ్మారీ ప్రజలను సామాజికంగా మరియు ఆర్ధికంగా ప్రభావితము చేసింది. వాస్తవానికి కరోనా విజృంభణ ఒక దావానలం వలె వ్యాపించి మానవాళిపై తన ఆధిపత్యాన్ని చూపిస్తూ ప్రపంచము మొత్తాన్ని పెద్ద సంక్షోభములో నెట్టివేసింది.

అంటువ్యాధులకు, గ్రామదేవతలకు సంబంధము ఉంది అనే విషయము రెండు క్రింది ప్రమాణాల ద్వారా అర్ధమవుతుంది.

మొదటి ప్రమాణము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలములో జరిగిన యదార్ధ సంఘటన. బనగాన పల్లి గ్రామములో మశూచి అంటువ్యాధి వచ్చినప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భార్య గోవిందమ్మ ఆ ఊరి గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లికి పొంగలి, పెరుగన్నము నివేదించడం, అప్పుడు పోలేరమ్మ తల్లి శాంతించి నేను ఈ వ్యాధినుండి ఉపశమనము ఇస్తాను అని చెప్పడము జరిగింది.

శిరిడిసాయి నాధుడు - జ్యోతీంద్ర తర్ఖడ్ మధ్య జరిగిన సంఘటన రెండవ ప్రమాణము. శిరిడి గ్రామములో కలరా దేవత విజృంభించి, జ్యోతీంద్ర తర్ఖడ్ ను తీసుకువెళ్ళడానికి రావడం, అప్పుడు శిరిడిబాబా వారు జ్యోతీంద్రను ఇవ్వను తనకి బదులుగా కావాలంటే నలుగురిని తీసుకు వెళ్ళు అని చెప్పడం జరిగింది.

ఈ రెండు ప్రమాణాలు గ్రామదేవతల ఆరాధన అనివార్యమని రుజువు చేస్తున్నాయి. గ్రామదేవతలను సంతృప్తి చేస్తే ఆ గ్రామమునకు శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి గ్రామాలలో ఆయా గ్రామదేవతల ఆరాధనతో పూర్వ వైభవాన్ని తీసుకు రావడమే విషజ్వరాది వైరస్ ల నుండి, కష్టనష్టాలనుండి విడిపడడానికి ఉపాయం.

లోక శ్రేయస్సుకై సిద్ధగురు ప్రణాళిక

సిద్ధగురువులు లోకకళ్యాణముకోసము పనిచేస్తారు. లోక శ్రేయస్సు కోసము వారి జీవితాలను నివేదన చేస్తారు. అరిష్టాలనుండి, దుష్టపీడలనుండి లోకమును రక్షించడానికి అవసరమైన రహస్య ప్రణాళికలు సిద్ధగురువులు మాత్రమే తయారుచేయగలరు.

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వారి దివ్య శక్తితో లోక కళ్యాణము కోసము బహిర్గతము చేసిన నిగూఢ రహస్యము కరోనా వంటి భయంకర వైరస్ ల నుండి రక్షణ పొందడానికి ఒకే ఒక ఉపాయము గ్రామదేవత ఆరాధన. సర్వ గ్రామదేవతల సంతుష్టికై, కరోనా వ్యాధి బాధా నివారణకై శ్రీ రమణానంద మహర్షి వారు 600 గ్రామదేవతల నామాలతో వారిని స్తుతిస్తూ “షట్ శతీ గ్రామదేవతా శ్రీ దుర్గా స్తోత్రం” ను రచించారు.

రమణేశ్వరం - గ్రామ దేవత

సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు లోక శ్రేయస్సుకై సెప్టెంబర్ 9, 2020 నాడు శ్రీ మారెమ్మ, శ్రీ ఎల్లమ్మ, శ్రీ పోలేరమ్మ, శ్రీ పోచమ్మ తల్లి అను నలుగురు గ్రామదేవతల విగ్రహాలను రమణేశ్వరములో ప్రతిష్ఠించారు. ఈ నలుగురు గ్రామ దేవతలు ఆ గ్రామాన్ని రక్షించడమే కాకుండా ఎవరైతే వారిని దర్శిస్తారో వారికి కూడా రక్షణ ప్రసాదిస్తారు.

View More
gallery